బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
సమన్లు జారీ చేసింది. ఒక గేమింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో శుక్రవారం నాడు ఈడీ
కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
మహాదేవ్ ఆన్లైన్ బుక్ యాప్ అనే గేమింగ్ యాప్‌కు రణబీర్ కపూర్ ప్రచారకర్తగా ఉన్నాడు. ఆ యాప్‌కు సంబంధించిన ప్రకటనల్లో
నటించాడు. దానికి గాను అతనికి పెద్దమొత్తంలో పారితోషికం చెల్లించారు. అయితే ఆ సంస్థ
నేరపూరితంగా ఆర్జించిన డబ్బులను నటుడికి చెల్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
ఈడీ కథనం ప్రకారం మహాదేవ్ ఆన్లైన్ బుక్ యాప్ అనేది
ఒక అంబరిల్లా సిండికేట్. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ వెబ్సైట్లకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను
ఏర్పాటు చేస్తుంది. కొత్త వినియోగదారులను ఎన్రోల్ చేయడం, వారికి యూజర్ ఐడీలు
క్రియేట్ చేయడం, బినామీ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమ మనీలాండరింగ్ కార్యకలాపాలకు
పాల్పడడం వంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తోందని ఈడీ ఆరోపిస్తోంది.
ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి కొత్త
నియమనిబంధనల ప్రకారం బెట్టింగ్, వేగరింగ్ ప్రమేయమున్న గేమ్స్‌ను ప్రభుత్వం
నిషేధించింది.
ఈ కేసుకు సంబంధించి రణబీర్ కపూర్ మాత్రమే కాదు,
కనీసం మరో డజను మంది నటులు, సెలబ్రిటీలు ఈడీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
వారందరికీ త్వరలో సమన్లు జారీ అవుతాయని సమాచారం.
ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి ఈడీ గత నెల
రూ.417 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మహాదేవ్ ఆన్లైన్ యాప్
నిర్వాహకులు మరో నాలుగైదు యాప్‌లను కూడా నిర్వహిస్తున్నారనీ, ఒక్కో యాప్ ద్వారా
రోజుకు కనీసం 200 కోట్ల లాభం కళ్ళచూస్తున్నారని వెల్లడించింది.
ఈ యాప్ నిర్వాహకులు
ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌కి చెందినవారనీ, ఈ యాప్ ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉందనీ ఈడీ
దర్యాప్తులో వెల్లడయింది. శ్రీలంక, నేపాల్ దేశాల్లో కాల్‌సెంటర్ల ద్వారా వ్యవహారం
నడిపిస్తున్నారని ఈడీ కనుగొంది.