స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించారు. సీఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణను కూడా రేపటికి వాయిదా వేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు చూపించాలని ప్రభుత్వ ఏఏజీని న్యాయమూర్తి కోరారు. ప్రభుత్వ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గతంలో చెప్పిందే మరలా చెపుతున్నారని జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఇరు వర్గాల వాదలను విని, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేశారు.
స్కిల్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 12కు న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించింది. స్కిల్ కేసులో లోకేశ్ పేరు చేర్చలేదని గత వారం సీఐడి తెలిపింది. స్కిల్ కేసులో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్దిపొందారని పేర్కొనడంతో లోకేశ్ ముందస్తు బెయిల్‌కు పిటిషన్ పెట్టుకున్నారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేశారు.