పారిశ్రామికవేత్తలకు
తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తొమ్మిది
ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహణ, మరో మూడు పరిశ్రమలకు సంబంధించిన ప్రారంభోత్సవ
కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. మరో ప్రాజెక్టుకు సంబంధించిన ఎంవోయూ పై
కూడా నేడు ముఖ్యమంత్రి సంతకం చేశారు.
ఆహార
శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.3,058 కోట్ల పెట్టుబడితో
సుమారు 7 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన యూనిట్ల
ద్వారా స్థానిక యువతకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు.
విశాఖ
లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో భాగంగా 386 ఒప్పందాలు జరిగాయని, వాటి
ద్వారా 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. వీటిపై ప్రతినెలా సమీక్ష నిర్వహిస్తున్నామన్న
సీఎం, సీఎస్ నేతృత్వంలో ఓ కమిటీ కూడా వేసినట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తల చేయి
పట్టుకుని నడిపించే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తోందని, తమ అధికారులంతా తగిన
సహాయం అందిస్తారన్నారు.