విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహానగర్ పరిధిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు శౌర్య
జాగరణ యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి
గుడి నుంచి దీనదయాళ్ నగర్ రామాలయం వరకూ యాత్ర నిర్వహించారు.
వివేకానంద మెమోరియల్ ట్రస్ట్ ప్రముఖ్ సదాశివరావు గారు ఈ శౌర్య జాగరణ
యాత్రను ప్రారంభించారు. ఉదయం 10గంటలకు మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద ప్రారంభమైన
యాత్ర… ట్రైనర్ పేట హనుమాన్ దేవాలయం మీదుగా దీనదయాళ్ నగర్ రామాలయంవరకు జరిగింది.
ఈ బజరంగ్ దళ్ శౌర్య జాగరణ యాత్రలో విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహానగర్ అధ్యక్షులు సాన శ్రీనివాస్, కార్యదర్శి
క్రోవి రామకృష్ణ, సహ కార్యదర్శి కె శ్రీనివాస్, ప్రఖండ ప్రముఖులు దాడి మురళీకృష్ణ, వర్మ, ఎంశ్రీనివాసరావు, మన్మధరావు, విజయవాడ ప్రముఖులు అడ్డూరి శ్రీరామ్, భోగవల్లి శ్రీధర్, శివకుమార్ పట్నాయక్, అవ్వారు శ్రీనివాసరావు, తదితర హిందూ బంధువులు పాల్గొని యాత్రను
జయప్రదం చేసారు.
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకూ దేశంలోని దాదాపు
5లక్షలకు పైగా గ్రామాల్లో యువతను జాగృతం చేయడమే లక్ష్యంగా బజరంగ్ దళ్ ఈ యాత్రను
నిర్వహిస్తోంది. కులాలకు అతీతంగా ప్రతీ హిందువు దేశ రక్షణకు కృషి చేయాలనే
లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ ఈ యాత్రకు పిలుపునిచ్చింది.