ఆసియా
క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో భారత ఆటగాళ్ళు ఆకట్టుకుంటున్నారు. జకర్తా వేదికగా 2018లో జరిగిన గత పోటీల్లో భారత్
70 పతకాలు సాధించగా, ఈ సారి ఇంకా కొన్ని ఈవెంట్లు మిగిలి ఉండగానే ఆ మార్కును
అధిగమించింది. ఇప్పటి వరకు 71 పతకాలను మనదేశం తన ఖాతాలో వేసుకుంది.
భారత్ సాధించిన
పతకాల్లో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ దఫా పోటీల్లో
కనీసం వంద పతకాలు సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
మన
రాష్ట్రానికి చెందిన విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్
టీమ్ ఫైనల్లో గెలుపొంది స్వర్ణ పతకం సాధించింది.
దక్షిణ కొరియా పై విజయం సాధించి ఈ పతకాన్ని సొంతం చేసుకున్నారు.
సురేఖ- ప్రవిస్ ఓజస్ దేవ్‌తలే 159-158 స్కోరుతో సో చయివాన్ – జూ జిహూన్ జంటపై
ఉత్కంఠభరిత విజయం సాధించింది. 35 కిలోమీటర్ల మిక్స్డ్ వాక్ విభాగంలోనూ భారత్
కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ పోటీలో చైనా గోల్డ్ మెడల్ సాధించగా, జపాన్
సిల్వర్‌ను కైవసం చేసుకుంది.
జ్యోతి
సురేఖ- ఓజస్కు కేంద్ర క్రీడల శాఖ మంత్రి
అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. అద్భుతమైన ప్రదర్శనతో పతకం సాధించి దేశానికి
గుర్తింపు తెచ్చారని కొనియాడారు.
బుధవారం
జరిగిన పోటీల్లో మహిళల జావెలిన్ త్రోలో అనూ రాణి స్వర్ణ పతకం సాధించింది.
ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రో విభాగంలో భారత్ కు
ఇదే మొదటి స్వర్ణ పతకం. మూడు వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్ లో రజతం గెలిచిన
పారుల్ చౌదరి, 5 వేల మీటర్ల మహిళల పరుగు పందెంలో స్వర్ణం కైవసం చేసుకుంది. మిక్స్డ్
4X4 రిలే పోటీల్లో రజతం గెలిచిన విద్యా
రామ్రాజ్, మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో కాంస్యం గెలిచింది.
ప్రస్తుతం భారత్ 16 స్వర్ణ పతకాలు,
26 రజత పతకాలు, 29 కాంస్య పతకాలు… మొత్తం 71 పతకాలు గెలుచుకుని పట్టికలో నాలుగో
స్థానంలో ఉంది. చైనా 164 స్వర్ణ పతకాలు సహా 300 పతకాలతో అగ్రస్థానంలో ఎవరికీ
అందనంత దూరంలో ఉంది. జపాన్ 33 స్వర్ణ పతకాలు సహా మొత్తం 131 పతకాలతో రెండోస్థానంలో
నిలిచింది. కొరియా 32 స్వర్ణ పతకాలు సహా మొత్తం 140 పతకాలతో మూడోస్థానంలో
కొనసాగుతోంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్