బంగారం
ధరలు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం హైదరాబాద్ లో రూ. 52,600 గా
ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.
57,380 పలుకుతోంది. అమెరికా డాలర్ విలువ పెరగడమే ధరలు తగ్గడానికి కారణం, కీలక
వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలతో అంతర్జాతీయ స్థాయిలో డాలర్ విలువ పెరుగుతోంది.
జూన్
29న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం
ధర రూ. 58,750 గా ఉంది. రాబోయే రోజుల్లో
కూడా హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు అస్థిరంగానే ఉంటాయని
ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా
అధిక ద్రవ్యోల్బణం కారణంగా కీలక వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడమే
దీనికి కారణమని వివరిస్తున్నారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల