టీడీపీ, జనసేనతో పొత్తును కేంద్ర పెద్దలు తేలుస్తారని ఏపీ బీజేపీ చీఫ్ పురందరరేశ్వరి స్పష్టం చేశారు. త్వరలో ఏపీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించనున్నారు. పొత్తులపై జనసేన అధినేత పవన్ ప్రకటన,ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె వెల్లడించారు.
పొత్తులు.. విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని పురందరరేశ్వరి తెలిపారు. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు. మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందన్నారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాల ఎలా జరిగాయనే అంశంపై విశ్లేషించుకున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు పేదలకు పంపిణీ చేశారు. మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసినట్టు గుర్తుచేశారు. మద్యం మీద, గ్రామ పంచాయతీ నిధుల మళ్లింపుపై ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆమె ప్రకటించారు.