తిరుమలలో కిడ్నాప్‌కు గురైన బాలుడి ఆచూకీ లభించింది. తిరుపతి అవిలాలకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేశాడని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. కిడ్నాపర్ అక్క ధనమ్మకు పిల్లలు లేకపోవడంతో చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కిడ్నాప్ చేసిన బాలుడుని ఏర్పేడు తీసుకెళ్లి సుధాకర్ అక్క ధనమ్మను అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.
తిరుపతి బస్టాండ్ లో కిడ్నాప్ కు గురైన తమిళనాడు చెన్నై కు చెందిన మురుగన్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. చిన్నపిల్లలతో తిరుమలకు వచ్చే భక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.