అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తెలుగుదేశం
అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు
తీర్పు రిజర్వ్ చేసింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు
వినిపించారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు కొనసాగించారు. ఏజీ వాదనలకు లూథ్రా
కౌంటర్ వినిపిస్తూ… రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని
కోర్టు దృష్టికి తెచ్చారు.
అనంతరం చంద్రబాబు
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్
చేసింది.