భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం
ముగ్గురిని వరించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఫిజిక్స్ నోబెల్ విజేతల పేర్లను మంగళవారం
ప్రకటించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి
చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్ ఈ ఏడాది
నోబెల్ ఫిజిక్స్ అవార్డులను గెలుచుకున్నారు.
అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం
చేసేందుకు, కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గానూ
వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
వీరి పరిశోధనలతో అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం
చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని పేర్కొంది.
ఈ ఏడాది నోబెల్
పురస్కారాల ప్రకటన సోమవారం మొదలైంది. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను
ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్
పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.