అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. సీఐడి తనకు ఇచ్చిన 41ఏ నోటీసులో పొందుపరచిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లోకేశ్ తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.హెరిటేజ్ కంపెనీలో లోకేశ్ భాగస్వామిగా ఉన్నారని, కంపెనీ తీర్మానాలు ఇవ్వాలంటే ప్రొసీజర్ ఉంటుందని న్యాయవాది పోసాని కోర్టుకు తెలిపారు.
హెరిటేజ్ లెక్కల కోసం తాము పట్టుబట్టడం లేదని బుధవారం విచారణకు లోకేశ్ హాజరు కావాలని సీఐడి తరపు న్యాయవాదులు కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబరు 10న సీఐడి విచారణకు లోకేశ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.