అక్టోబర్ 1 మిలాదున్నబీ సందర్భంగా కర్ణాటకలోని శివమొగ్గ
పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలాదున్నబీ ఊరేగింపులో పాల్గొన్న
ముస్లిములు హిందువుల ఇళ్ళపై రాళ్ళదాడులకు పాల్పడ్డారు. టిప్పు సుల్తాన్ హిందువులను
చంపుతున్నట్లుగా కటౌట్ ప్రదర్శించారు. అలాగే ఔరంగజేబు అఖండ భారత సామ్రాజ్యాన్నీ
జయించి పరిపాలించినట్లు పోస్టర్లు పెట్టారు.
ముస్లిముల రాళ్ళదాడి ఘటనలో కసీనం నలుగురు
గాయపడ్డారు. ఘటన జరిగిన రాగిగుగ్గ ప్రదేశంలో ఘర్షణలు విస్తరించకుండా పోలీసులు
సీఆర్పీసీ సెక్షన్ 144 విధించారు. నిజానికి, రాళ్ళదాడి ఘటనలో పలువురు పోలీసులు,
ఆఖరికి ఎస్పీ కూడా గాయపడినట్లు సమాచారం. అయితే పోలీసులు ఆ విషయం గురించి బైటకు
చెప్పడం లేదు. ఒక సోషల్ మీడియా వీడియోలో… ‘అయ్యో, వాళ్ళు పోలీసులను కూడా
కొడుతున్నారు’ అంటూ వ్యాఖ్యలు వినిపించాయి. దీన్నిబట్టి, ఊరేగింపులో పాల్గొన్నవారు
ఎంత వ్యవస్థీకృతంగా రాళ్ళదాడులకు పాల్పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.
మిలాదున్నబీ ఊరేగింపులో ముస్లిములు టిప్పు
సుల్తాన్ కటౌట్‌ను ప్రదర్శించారు. కాషాయ దుస్తులు వేసుకున్న ఇద్దరిని టిప్పు
సుల్తాన్ కత్తితో నరికి చంపుతున్నట్టుగా కటౌట్‌ను తయారుచేసి ఊరేగింపులో బహిరంగంగా
ప్రదర్శించారు. కాషాయ దుస్తుల ఆహార్యాన్ని బట్టి టిప్పుసుల్తాన్ చంపింది
హిందువులను అనే అర్ధం ధ్వనించేలా ఉద్దేశపూర్వకంగా కటౌట్‌ను ప్రదర్శించినట్లు
అర్ధమవుతోంది. దానిపై హిందూ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ కటౌట్‌ను
తీసేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు
ఊరేగింపును కొద్దిసేపు నిలిపివేసారు. అయితే పోలీసుల చర్యలతో ముస్లిములు మరింత
రెచ్చిపోయారు. బారికేడ్లను ధ్వంసం చేసి పోలీసులపై రాళ్ళు రువ్వారు. దాంతో ముస్లిము
మూకలను తరిమికొట్టడానికి పోలీసులు లాఠీచార్జిచేయవలసి వచ్చింది.
శివమొగ్గ ఎస్పీ జికె మిథున్ కుమార్ రెండు మతాలకు
చెందిన స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి
సహాయం కోసం విజ్ఞప్తి చేసారు. ఉద్రిక్త పరిస్థితులను
నివారించడానికి, టిప్పుసుల్తాన్ నరుకుతున్నట్టుగా పెట్టిన హిందూ రాజుల బొమ్మలను
కర్టెన్‌తో కప్పివేయాలని సూచించారు. ఇక ఈ ఘర్షణలకు పాల్పడిన పలువురిని అదుపులోకి
తీసుకున్నారు.
బీజేపీ ఎంఎల్ఏ సీఎన్ అశ్వత్థనారాయణ్ ఈద్
ఊరేగింపులో తీసిన కొన్ని ఫొటోలను ఎక్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. వాటిలో
ఉర్దూలో నినాదాలు రాసిన కత్తి ఒకటుంది. మరో ఫొటోలో మసీదు బైట వేలమందిని చంపిన
ఔరంగజేబు చిత్రం ఉంది. ఇంకొక ఫొటోలో టిప్పుసుల్తాన్ కటౌట్, శివమొగ్గ నగరంలో
ఇస్లామిక్ జెండాల ఎగురవేత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ ఫొటోలకు వ్యాఖ్యగా అశ్వత్థ నారాయణ్ ఎక్స్‌లో
ఇలా రాసుకొచ్చారు. ‘‘కావేరీ సమస్యను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వని కాంగ్రెస్
ప్రభుత్వం, మత కల్లోలాలు, ఘర్షణలను రెచ్చగొడుతోంది. శాంతికి నిలయమైన శివమొగ్గ
నగరంలో టిప్పుసుల్తాన్ కటౌట్ పెట్టించడం, ఊరేగింపులో తల్వార్లను ప్రదర్శించడం ద్వారా
మతోద్రిక్తతలను రెచ్చగొట్టడానికి జరిగిన ప్రయత్నాలకు కాంగ్రెస్ ప్రభుత్వం
బహిరంగంగా మద్దతిచ్చింది’’. అని ఆయన ఎక్స్‌లో రాసారు.
శివమొగ్గ జిల్లాకు చెందిన బీజేపీ ఎంఎల్ఏ చెన్నబసప్ప,
తన నియోజకవర్గంలో పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. ‘సమస్యల కారకులను గుర్తించి
వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవలే, ఇంటికి వెడుతున్న ఒక వంటవాడిని ముస్లిములు
తల పగలగొట్టి చంపేందుకు ప్రయత్నించారు. అమాయకుల మీద ముస్లిములు ఉద్దేశపూర్వకంగా,
ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడిచేసారు’ అని చెన్నబసప్ప చెప్పుకొచ్చారు.
‘‘అంతకు కొద్దిరోజుల ముందే గణపతి నవరాత్రుల
అనంతరం నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. అప్పుడు ఇలాంటి ఉద్రిక్తతలేవీ
చోటు చేసుకోలేదు. ముస్లిములు మిలాదున్నబీ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా హిందువులను
అవమానపరిచి, వారి ఇళ్ళపై రాళ్ళదాడులకు పాల్పడడం వెనుక, తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా
ఉందన్న ధీమా ఉంది. ముస్లిములను జైళ్ళలోనుంచి సైతం విడిచిపెట్టేస్తోంది. అల్లర్లకు
పాల్పడిన వారిని విడిచిపెట్టేయాలంటూ స్వయానా హోంమంత్రే లేఖలు రాస్తున్నారు’’ అని
చక్రవర్తి సుళిబెళె అనే కార్యకర్త వివరించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముస్లిముల
అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మా ఓట్లతో గెలిచిన ప్రభుత్వంలో మాకు
మెట్టువాటా మంత్రిపదవులు కావాలని డిమాండ్ చేసిన ఘటన, ఇటీవలే పాకిస్తాన్ జెండాలు
ఎగరేసిన ఘటన, వంటివి మరచిపోకముందే ఇప్పుడు శివమొగ్గలో ఔరంగజేబు, టిప్పుసుల్తాన్ల
కటౌట్లు, హిందువుల ఇళ్ళపై రాళ్ళదాడుల ఘటనలు కర్ణాటకలో హిందువుల భవిష్యత్తుకు
సూచికగా నిలుస్తుంది.