చైనా హాంగ్జౌలోజరుగుతున్న ఆసియా క్రీడలు
పదోరోజుకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ భారత్ 60 పతకాలు సాధించి పట్టికలో నాలుగో
స్థానంలో నిలిచింది. వాటిలో 13 స్వర్ణ పతకాలు, 24 రజత పతకాలు, 23 కాంస్య పతకాలు
ఉన్నాయి.
ఇవాళ బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలు జరగనున్నాయి.
రెండుసార్లు ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన పివి సింధు, పురుషుల విభాగంలో
హెచ్ఎస్ ప్రణయ్ పోటీల్లో పాల్గొంటారు.
బాక్సింగ్‌లో ప్రపంచ చాంపియన్ లవ్లీనా బోర్గోహెయిన్
ఇవాళ 75 కేజీల కేటగిరీలో సెమీ ఫైనల్లో పాల్గొననుంది. ఆమె విజయం సాధించే అవకాశాలు
ఎక్కువగా ఉన్నాయి. మహిళల 54 కేజీల కేటగిరీలో ప్రీతీ పవార్, పురుషుల 92 కేజీల
కేటగిరీలో నరేందర్ పోటీ పడనున్నారు.
కబడ్డీలో గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌తో
తలపడనుంది. ఏడుసార్లు చాంపియన్‌షిప్ సాధించిన భారత్‌కు ఈ మ్యాచ్ నల్లేరుపై నడకగానే
భావిస్తున్నారు. కబడ్డీ మహిళల జట్టు కూడా ఇవాళ కొరియాతో పోటీ పడనుంది.
పురుషుల క్రికెట్లో భారత్-నేపాల్ మధ్య మ్యాచ్
పూర్తయింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ నేపాల్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన
భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టీ29 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల నష్టానికి
202 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో నేపాల్ కూడా దూకుడుగానే ఆడింది. అయితే భారత
బౌలర్లు మళ్ళీ పుంజుకోవడంతో నేపాల్‌కు ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9
వికెట్లు కోల్పోయిన నేపాల్ 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో భారత్ 23
పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 49 బంతుల్లో 100
పరుగులు చేసి ఔటయ్యాడు. టి20 చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడిగా
రికార్డు సృష్టించాడు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి సెంచరీ కూడా. ఈ గెలుపుతో
భారత్ ఆసియా క్రీడల్లో క్రికెట్ ఈవెంట్లో సెమీఫైనల్స్ దశకు చేరుకుంది.
ఇంక అథ్లెటిక్స్‌లో 110
మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో వంటి క్రీడాపోటీలు
ఇవాళ జరగనున్నాయి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్