నోబెల్ సందడి మొదలైంది. వైద్యరంగంలో విశేష కృషి చేసినందుకు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్లకు ప్రతిష్ఠాత్మక నోబెల్ వరించింది. కరోనాను అడ్డుకునేందుకు
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీలో, న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్ల ఆవిష్కరణలకు వీరికి వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డు ప్రకటించారు.
వారం రోజుల పాటు నోబెల్ అవార్డుల ప్రకటనలు కొనసాగనున్నాయి. ఇవాళ భౌతికశాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ప్రకటించనున్నారు. ఈ ఏడాది నోబెల్ బహుమతి పురష్కార గ్రహీతలకు ఇచ్చే మొత్తాలను కూడా భారీగా పెంచారు. బహుమతి గ్రహీతలందరికీ కలిపి ఈ ఏడాది 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్లను అందజేయనున్నారు.