ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్
చొరవ లేకపోతేతమ దేశం ఇప్పటికీ అశాంతిలోనే
మగ్గిపోతుండేదని కొలంబియా పార్లమెంట్ సభ్యుడు జువన్ కార్లోస్ అన్నారు. అమెరికా
వాషింగ్టన్ డీసీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ దేశంలో శాంతి
నెలకొనేందుకు రవిశంకర్ కృషి చేశారని, దానికి తమ దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు.
‘‘కొలంబియా,
ప్రపంచంలో ఎవరికైనా
రుణపడి ఉందీ అంటే అది గురుదేవ్
రవిశంకర్కే. ఆయన బొగోటా వచ్చి మా అధ్యక్షుడు, తిరుగుబాటుదారులైన
రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా మధ్య సయోధ్య కుదిర్చారు.
గాంధీ అహింసా మార్గాన్ని అనుసరిస్తూ కాల్పుల విరమణకు పాటుపడ్డారు.
తిరుగుబాటుదారులకు నచ్చజెప్పి ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదిరేలా చేశారు. ఆయనే
లేకుంటే కొలంబియాలో నేటికీ
శాంతి ఉండేది కాదు. మేం మిమ్మల్ని మా దేశ పౌరులుగా భావిస్తున్నాం. కొలంబియానూ
మరో నివాసంలా భావించండి’’ అని కార్లోస్
అన్నారు.
50
ఏళ్ళుగా ఘర్షణల నడుమ అట్టుడికిన కొలంబియాలో శాంతి సాధించడానికి రవిశంకర్ గణనీయమైన కృషి
చేసారు. అందుకే ఆయన్ను కొలంబియా ప్రభుత్వం 2015లో తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం
‘ఆర్డెన్ డె లా డెమోక్రసియా సైమన్ బొలివార్’ అవార్డుతో సత్కరించింది.