మణిపూర్‌లో ఇద్దరు విద్యార్ధుల
హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఆ కేసుకు సంబంధించి ఇద్దరు పురుషులు,
ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.
పావోమిన్‌లున్ హావోకిప్, మల్సామ్
హావోకిప్, లింగ్నేచాంగ్ బెయిటేకుకీ, టినేలింగ్ హెన్తాంగ్ అనే నలుగురూ ఈ కేసులో
నిందితులని గుర్తించిన సీబీఐ, వారిని అరెస్ట్ చేసింది. వారిని గువాహటి కోర్టు
ముందు ప్రవేశపెడతారు.
మృత విద్యార్ధులిద్దరూ మైనర్లే.
వారి తల్లిదండ్రలు జులై 9న ఇంఫాల్ పీఎస్‌లోనూ, జులై 19న లాంఫెల్ పీఎస్‌లోనూ ఫిర్యాదు
చేసారు. తొలుత మణిపూర్ పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం
వినతి మేరకు సీబీఐ ఆగస్టు 23న రెండు కేసులు రిజిస్టర్ చేసి, మణిపూర్ పోలీసుల నుంచి
ఈ కేసును తీసుకుంది.
నిందితులు ఘటన జరిగిన తర్వాత
కర్ణాటక పారిపోయారు. వారిని, వారితో పాటు ఉన్న ఇద్దరు మైనర్లను ఇంఫాల్ నుంచి గువాహటి
తీసుకొచ్చారు. ఆ పిల్లలను కామరూప్ జిల్లా బాలల రక్షణ అధికారికి అప్పగించారు.
ఈ కేసులో నిందితులకు గరిష్ట శిక్ష
పడేలా చూస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు.