చైనాలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇవాళ స్కేటింగ్ ఈవెంట్లో భారత ఆటగాళ్లు రెండు కాంస్య పతకాలు సాధించారు. 3000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ రిలేలో మహిళల జట్టు, 300 మీటర్ల స్పీడ్ స్కేటింగ్‌లో పురుషుల జట్లు కాంస్య పతకాలు సాధించాయి. 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రాంరాజ్ 55.42 సెకండ్లలో పరుగు పూర్తి చేసి పీటీ ఉష రికార్డును సమం చేసింది.
ఆదివారం జరిగిన అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు స్వర్ణం సాధించారు. 3000 మీ. స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే గోల్డ్ మెడల్ సాధించారు. 8 నిమిషాల 19.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అథ్లెటిక్స్‌లో మొదటి బంగారు పతకం సాధించారు. తజిందర్ సింగ్ షాట్‌పుట్‌లో ఆరో ప్రయత్నంలో 20.36 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 53 పతకాలు సాధించింది. అందులో 13 స్వర్ణాలు, 21 రజత, 19 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత ఆటగాళ్లు నాలుగవ స్థానంలో నిలిచారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్