తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 29న మూసివేయనున్నారు.
29వ తేదీన తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని 8 గంటలపాటు
మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ
కాలానికి ఆరు గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ కాబట్టీ, 28వ తేదీ రాత్రి
7.05 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
గ్రహణం తెల్లవారుజామున 1.05 గంటలకు ప్రారంభమై
2.22 గంటలకు పూర్తవుతుంది. అనంతరం వేదోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి
ఆలయాన్ని తెరుస్తారు. వేకువ జామున 3.15 గంటలకు
శుద్ధి చేసి సుప్రభాత సేవల తర్వాతి నుంచి యధావిధిగా భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం దృష్ట్యా సహస్ర
దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనం 28న రద్దు చేశారు. పెరటాసి
రద్దీ కారణంగా నేడు ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.