ప్రధాని
నరేంద్ర మోదీ చొరవ, దూరదృష్టితో దేశంలో స్వచ్ఛ విప్లవానికి నాంది పలికింది.
గాంధీజయంతి ముందు రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ప్రధాని
ఇచ్చిన పిలుపునకు దేశం మొత్తం స్పందించింది.
కేంద్రమంత్రుల నుంచి విద్యార్థుల వరకు
ప్రతీ ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతకు కృషి చేశారు. బహిరంగ
ప్రదేశాలు, వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల ప్రాంగణాల్లో శ్రమదానం
చేశారు.
విజయవాడలోని
ఈఎస్ఐసీ ఆస్పత్రి పరిసరాలతో సిబ్బంది ఆఫీసులో oysc వలంటీర్లు శ్రమదానం చేశారు. చెత్త, ఇతర వ్యర్థాలను
తొలగించారు.
Oysc సంస్థ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం
చేపట్టారు. సంస్థ అధ్యక్షుడు సోహన్ పప్పు ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు.
పౌరులంతా స్వచ్ఛ భారత్ మార్గదర్శకత్వాలు
పాటించాలని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సోహన్ కోరారు.
ప్లాస్టిక్
వాడకాన్ని తగ్గించాలని, ప్రమాదకర వ్యర్థాల పట్ల అప్రమత్తతో మెలగాలని సూచించారు. పరిశుభ్ర
భారత్ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని కోరారు.