జమ్మూ కశ్మీర్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాంబన్ జిల్లాలో రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ తరలిస్తోన్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున కొకైన్ సీజ్ చేశారు. ముఠా వద్ద 30 కిలోల కొకైన్ పట్టుబడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. డ్రగ్స్ తరలిస్తోన్న ఇద్దరు పంజాబీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
జేకేలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కొన్నాళ్లుగా నిఘా పెంచారు. జమ్మూ కశ్మీర్ జాతీయ రహదారిలోని బేనీహాల్ వద్ద శనివారం రాత్రి పదిన్నరకు ఓ వాహనాన్ని తనిఖీ చేయగా 30 కేజీల డ్రగ్స్ గుర్తించారు. చాలా హైగ్రేడ్ కొకైన్‌గా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు జమ్మూ జోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు.