తుర్కియే
పార్లమెంట్ సమీపంలో ఆత్మాహుతి దాడి
జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు ఆ దేశ మంత్రి అలీ యెర్లికయ
తెలిపారు.
ఓ
ప్రైవేటు వాహనంలో వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు, ఉదయం 9 గంటల సమయంలో తుర్కియే
పార్లమెంట్ సమీపంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ భవనంలోని జనరల్ డైరక్టరేట్
సెక్యూరిటీ ఆఫీసు ప్రధాన గేటు దగ్గర బాంబు విసిరారు. ఓ ఉగ్రవాది ఆత్మహుతికి
పాల్పడ్డాడు.
పార్లమెంట్
భవనంతో పాటు ఇతర మంత్రుల కార్యాలయాలు ఉన్న ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా
చేసుకుని దాడులు చేస్తున్నారు.
మూడు నెలల విరామం తర్వాత తుర్కియే పార్లమెంట్ సమావేశాలు
ప్రారంభం కానున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారనే
సమాచారంతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.
ఉగ్రవాదులు
దాడితో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఘటనలో ఇద్దరు
అధికారులు గాయపడ్డారు.
సమాచారం
అందుకున్న ప్రత్యేక దళాలు, అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.