ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శ్రమదానం చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో
భాగంగా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేశారు. అక్టోబర్2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా
అక్టోబర్ 1న స్వచ్ఛాంజలి సమర్పించాలని మన్
కీ బాత్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నివ్వగా, కేంద్రమంత్రుల నుంచి
విద్యార్థుల వరకు అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛ సేవ చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 9.20 లక్షల ప్రదేశాల్లో
ఈ కార్యక్రమం చేప్టటారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ
జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా, సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు ఈ స్వచ్ఛ
సేవా కార్యక్రమంలో పాల్గొని రోడ్ల వెంబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.
అహ్మదాబాద్ లో నిర్వహించిన స్వచ్ఛతా హీ
సేవా కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి పటేల్ సహా
పలువురు ప్రముఖులు చీపురు పట్టి వీధులు ఊడ్చారు.
ఉత్తరప్రదేశ్ లో సీతాపూర్ నిర్వహించిన
కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం యోగీ పాల్గొన్నారు. బీజేపీ యూపీ అధ్యక్షుడు భూపేంద్ర
సింగ్ చౌదరి కూడా లఖ్నోలో స్థానిక నేతలతో కలిసి శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం
చేశారు. చెత్త రహిత భారతదేశమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన
స్వచ్ఛతా అభియాన్ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి మినాక్షి
లేఖి పాల్గొన్నారు.
పట్నాలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ శ్రమదానం చేశారు.
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
దిల్లీలోనే స్వచ్ఛతా హీ సేవలో పాల్గొనగా, మరో కేంద్రమింత్రి ధర్మేంద్ర ప్రదాన్
కూడా ఇందులో భాగస్వాములయ్యారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హరియాణాలోని
గురుగ్రామ్‌లో పరిసరాలు శుభ్రం చేయగా,
ముంబై తీరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
పాల్గొన్నారు.