సమాజం
సమతుల్యతతో ముందుకు సాగేందుకు కులాలు పుట్టాయని, వృత్తి ధర్మం కోసం కులం కేటాయించారని నెల్లూరు విభాగ్ సద్భావన
ప్రముఖ్ సావర్కర్ అన్నారు. యర్రగొండపాలెంలో నిర్వహించిన మండలస్థాయి సద్భావన సదస్సు
లో పాల్గొన్న సావర్కర్ .. కులం వృత్తి
ఆధారంగా ఏర్పడిందని, వృత్తులు సమాజాన్ని బలోపేతం చేస్తాయని
చెప్పారు. గ్రామాల్లో కులాలు సంఘటితం కావాలి అని, కులపెద్దలు ఐక్యత కోసం కృషి చేయాలని కోరారు. కులాల ఐక్యతనే హిందూ
సంఘటన అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా సంపర్క ప్రముఖ్ రామకృష్ణ
మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హిందూ సాంప్రదాయాలు కాపాడుకునేందుకు అన్ని సామాజిక
వర్గాల నుంచి పదిమందితో కమిటీ వేయాలని కోరారు. ఈ సదస్సులో పది గ్రామాల నుంచి
ఎనిమిది సామాజిక వర్గాలకు చెందిన 18 మంది పాల్గొన్నారు. విభాగ్ సహ ప్రచార ప్రముఖ్
సూర్యనారాయణ బాబు, జిల్లా సామాజిక సమరసత ప్రముఖ్ కృష్ణమూర్తి, ఖండ వ్యవస్థ ప్రముఖ్ పరిటాల సుబ్బారావు
పాల్గొన్నారు.