పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడి వెనుక భారత ఇంటెలిజెన్స్ సంస్థ రా హస్తం ఉందని పాకిస్థాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. మస్తాంగ్ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్న శక్తులను దేశంలోని పౌర, సైనిక శక్తులన్నీ కలసి ఎదుర్కొంటున్నాయని పాకిస్థాన్ మంత్రి సర్ఫరాజ్ బుగిటి మరోసారి ఆరోపణలు చేశారు. ఈ ఆత్మాహుతి దాడి వెను భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా హస్తం ఉందని ఆయన విమర్శించారు. ఎలంటి ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు.
బలూచిస్థాన్ ఆత్మాహుతి దాడికి కేసులో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పాక్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బలూచిస్థాన్ పేలుళ్లలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 60కు చేరింది. మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకుని మసీదులో ప్రార్థనలు జరిగాల్సిన కొద్ది సమయం ముందు ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా పాక్‌లో తెహ్రీకీ తాలిబన్ భారీ దాడులకు దిగుతోంది. ఈ దాడి ఘటనకు ఏ తీవ్రవాద సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు.