చైనాలోని
హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్ళు మెరుగైన ప్రదర్శనతో
పతకాలు సాధిస్తున్నారు.
భారత
గోల్ఫర్ అదితి అశోక్, మహిళల గోల్ఫ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. ఆసియా
గేమ్స్ గోల్ఫ్ విభాగంలో భారత్ కు పతకం
తెచ్చిన మొట్టమొదటి మహిళగా అదితి రికార్డు
నెలకొల్పారు.
అంతకు ముందు 1982లో లక్ష్మణ్ సింగ్ గోల్ఫ్ లో స్వర్ణం సాధించగా, 41
ఏళ్ళ తర్వాత మళ్లీ భారత్కు పతకం దక్కింది.
పురుషుల
ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు కైవాన్ చెనై, జోరవర్ సింగ్ సందు, పృథ్విరాజ్
తొండైమాన్ గోల్డ్ మెడల్ గెలిచారు.
షూటింగ్ లో ఇది 21వ పతకం.
షూటింగ్,
రోయింగ్ విభాగాల్లో ఎక్కువగా పతకాలు భారత ఆటగాళ్ళు కైవసం చేసుకున్నారు. మహిళల
క్రికెట్ లో కూడా స్వర్ణం దక్కింది. ఈక్వెస్ట్రియన్ లో కూడా 41 ఏళ్ళ తర్వాత మన
ఆటగాళ్ళు గోల్డ్ మెడల్ సాధించి రికార్డు సృష్టించారు.
19
వ ఆసియా గేమ్స్ షూటింగ్ విభాగంలో భారత్ కు ఇప్పటికి ఏడు బంగారు పతకాలు వచ్చాయి.
అన్ని విభాగాల్లో కలిపి భారత్ 11 గోల్డ్, 16 సిల్వర్, 14 బ్రాంజ్ తో కలిపి మొత్తం
41 పతకాలు సాధించింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్