దేశవ్యాప్తంగా
నాలుగు నెలల రుతుపవనాల కాలం 820 మిల్లీమీటర్ల వర్షపాతంతో ముగిసింది. ఈ మేరకు భారత
వాతావరణ శాఖ ప్రకటించింది. దీర్ఘకాల సరాసరి వర్షపాతం 868.6 మిల్లీమీటర్లతో
పోలిస్తే ఇది తక్కువేనని తెలిపింది.
దేశంలో
ఈ సారి సరాసరిన 91 శాతం వర్షపాతం నమోదైంది.
ఎల్నినో ఉన్నా సాధారణానికి దగ్గరగా
వర్షం పడటతో కొంత ఉపశమనం లభించింది. 94 శాతం నుంచి 106 శాతం మధ్య కురిస్తే సాధారణంగా
పరిగణిస్తారు.
దేశంలోని
73 శాతం ప్రాంతాల్లో 18 శాతం లోటు వర్షపాతం నమోదైందని ఐఎండీ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర
తెలిపారు.
తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 1,115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని
ఇక్కడ సాధారణంగా 1,367 మిల్లీమీటర్లుగా ఉందని తెలిపారు.
ఈ
ఏడాది జూన్ లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా, జులైలో భారీ వానలు కురిశాయి. 1901
సంవత్సరం తర్వాత ఈ ఏడాది ఆగస్టు అత్యంత వేడి నెలగా రికార్డుకెక్కింది.
సెప్టెంబర్
లో అల్పపీడనాలు ఏర్పడటంతో మంచి వర్షాలే కురిశాయి. 2023 కంటే ముందు వరుసగా నాలుగేళ్ళపాటు
సాధారణం, అంతకంటే అధిక వానలు పడ్డాయి.
అక్టోబర్లో
సాధారణం కంటే అధిక ఉష్ణోగత్రలు నమోదు అవుతాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల
కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, దక్షిణ కర్ణాటకలో రెండు నెలల
కాలానికి సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.