భారత్లో తమ రాయబార కార్యాలయం నేటి నుంచి మూసివేస్తున్నట్టు ఆఫ్ఘన్ ప్రకటించింది. ఆఫ్ఘన్ పట్ల భారత్ ఆసక్తి చూపడం లేదని, దౌత్యపరంగా తమకు మద్దతు ఇవ్వడం పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, ద్త్వౌపాక్షిక సంబంధాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్లో తమ రాయబార కార్యాలయం మూసివేత పట్ల చింతిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.
అనేక కారణాలను చూసి తమ కార్యాలయంలో సిబ్బందిని తగ్గించారని, వనరుల లేమితో కార్యాలయం కొనసాగించడం ఇబ్బందిగా మారిందని, మరో మార్గం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. అధికారాలను భారత్కు అప్పగించే వరకు ఆఫ్ఘన్ పౌరులకు సేవలు అందించనున్నట్టు ప్రకటించారు.
ఢిల్లీలో ఆఫ్ఘాన్ రాయబారిగా మముండ్జే పనిచేస్తున్నారు.తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘాన్ వెళ్లక ముందు అప్పటి అధ్యక్షుడు మముండ్జేను నియమించారు. తాలిబన్లు కూడా ఇతన్నే కొనసాగించారు.