ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 4న ఉదయం
10గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద
నోటీసు జారీ చేసారు.
లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్నారు. సీఐడీ అధికారులు అక్కడికే వెళ్లి
లోకేష్‌కు నోటీసులు అందజేసారు.
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్మెంట్
వ్యవహారంపై గతేడాది నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేష్ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది.
ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై
శుక్రవారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.
ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.
సీఆర్పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన
రానందున ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.