ప్రధాని
నరేంద్రమోదీ పిలుపు మేరకు అక్టోబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, స్వచ్ఛ
భారత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి కోరారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన
సేవా కార్యక్రమాలు అక్టోబర్ 2తో ముగుస్తాయన్నారు.
బీజేపీ ముఖ్యనేతలతో నిర్వహించిన
ఆడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు వివరించారు.
జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఆదివారం నాడు ప్రభుత్వ
స్థలాలు, పార్కులు, ఇతర ప్రదేశాల్లో స్వచ్ఛ సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించిన
పురందరేశ్వరి.. కార్యకర్తలంతా పాల్గొనాలని కోరారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి
సందర్భంగా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. మద్యం కారణంగా అనారోగ్యానికి
గురైన వారిని జిల్లా ఆస్పత్రుల్లో పరామర్శించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక
విధానాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.