తిరుమలేశుడి
దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు
దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం కోసం తరలివచ్చారు. వేంకటాచలం
వెళ్లే దారులన్నీ భక్తులతో కిక్కిరిశాయి.
అలిపిరి
వద్ద పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోగా, అలిపిరి నుంచి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం
వరకు తమిళనాడు నుంచి వచ్చిన బస్సులు నిలిచిపోయాయి.
వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ 1,2 నారాయణగిరి షెడ్లలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లు దూరం భక్తులు బారులు
తీరారు.
వరుస సెలవులకు తోడు శనివారం కావడంతో ఇవాళ టోకెన్ లేని
భక్తులకు 48 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనానికి 7 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక
ప్రవేశ దర్శనానికి 5 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది.
అక్టోబర్ 2 వరకు సెలవులు
ఉండటంతో మరో మూడు రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా
వేస్తున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం అందజేస్తున్నారు. దాదాపు
2,500 మంది సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు.