విశాఖపట్నం
తీరానికి కొట్టుకొచ్చిన బాక్స్‌ను అధికారులు తెరిచారు. పురావస్తు శాఖ అధికారులు,
పోలీసులు సంయుక్తంగా దానిని రెండు ప్రొక్లెయిన్ల సాయంతో పగలగొట్టారు. అందులో ఎలాంటి వస్తువులు లేవని కేవలం చెక్క
దిమ్మె మాత్రమేనని తేల్చారు. బీచ్ లో పడవలకు లంగర్ వేసే దిమ్మె అని నిర్ధారించారు.
శుక్రవారం
రాత్రి వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకు వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అది పురాతన చెక్క పెట్టె అనుకుని
ప్రొక్లెయినర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. దానిని
తెరిచే వరకు కాపలా కాసారు.
పురావస్తు అధికారులు వచ్చిన తర్వాత తెరవగా అది అసలు
పెట్టే కాదని తేలింది. కేవలం చెక్కలతో చేసిన దిమ్మె అని, పడవలు నిలిపేందుకు ఉపయోగించేదని
స్పష్టం చేశారు.