బస్సు యాత్ర చేపట్టే ఛాన్స్
టీడీపీ
అధినేత చంద్రబాబును రాష్ట్రప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందంటూ ఆ పార్టీ నేతలు
వరుస ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ం ‘మోతమోగిద్దాం’
పేరుతో నిరసనలు చేపట్టాలని ఇప్పటికే శ్రేణులకు పిలుపునిచ్చింది. చంద్రబాబు సతీమణి నారా
భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
అచ్చెన్నాయుడు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 రాత్రి 7
గంటల నుంచి 7.05 వరకు ప్రతీ ఇంట్లో లైట్లన్నీ ఆపేసి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరారు.
త్వరలో
టీడీపీ, జనసేన నుంచి కొంతమందితో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పోరాడతామన్న అచ్చెన్నాయుడు,
ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు పవన్ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో
పర్యటిస్తారని తెలిపారు.
చంద్రబాబు
అరెస్టుతో పలువురు కలత చెందారని, అక్రమ
అరెస్టును తట్టుకోలేక ఇప్పటికే 97 మంది చనిపోయారని చెప్పారు. వీరికి నంద్యాలలో
జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో సంతాపం తెలిపామన్నారు.
ప్రాణాలు
విడిచిన వారి కుటుంబాలను త్వరలో కలిసి ధైర్యం చెబుతామన్నారు.
మేలుకో తెలుగోడా పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర
కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు జైల్లో ఉండటం, న్యాయపోరాటంలో
భాగంగా లోకేశ్ దిల్లీకి పరిమితం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది.
తెలుగు తమ్ముళ్ళలో జోష్ నింపేందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని
ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు భువనేశ్వరి చేపట్టే ‘మేలుకో తెలుగోడా’
కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆ పార్టీ అభిమానులు, కేడర్ అభిప్రాయపడుతున్నారు.