ప్రధాని
నరేంద్ర మోదీకి నటుడు హీరో సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. సెన్సారు
బోర్డు ముంబై కార్యాలయంలో అవినీతికి సంబంధించి తాను చేసిన ఫిర్యాదు మీద కేంద్రప్రభుత్వం వేగంగా
స్పందించడంపై విశాల్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు.
‘‘మీరు
తీసుకున్న చర్యలు, అవినీతికి పాల్పడాలనుకునే ప్రభుత్వ అధికారుల్లో భయాన్ని
నింపుతాయని ఆశిస్తున్నా, లంచాలు తీసుకోకుండా నిజాయితీగా సేవలందించేందుకు ఈ చర్యలు
దోహపడతాయి. మీరు స్పందించిన తీరు సంతృప్తినిచ్చింది. నా లాగే అవినీతి కారణంగా
ఇబ్బందిపడిన సామాన్యులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా’’ అని ప్రధాని మోదీ, మహారాష్ట్ర
సీఎం ఏక్నాథ్ షిండేకు ధన్యవాదాలు తెలిపారు. జైహింద్ అని తన పోస్టును ముగించారు.
మార్క్
ఆంటోని సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని
నటుడు విశాల్ గురువారం ట్విట్ చేశారు. సెన్సార్ కోసం రూ. 6.5 లక్షలు లంచంగా
చెల్లించానని ఆయన తెలిపారు. మరో దారిలేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఏ నిర్మాతకూ
ఇలా జరగకూడదంటూ విశాల్ పేర్కొన్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా వెల్లడించారు.
దీనిపై
కేంద్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకుంది. ఓ సీనియర్ అధికారిని విచారణ కోసం
ముంబై పంపింది. CBFC వేధింపులకు ఎవరైనా గురై ఉండుంటే తగు
సమాచారాన్నిjsfilms.inb@nic.inను తెలపాలని కోరింది.