మాజీ
సీఎం చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్
చేసింది. సర్వీసు నిబంధనలు అతిక్రమించారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సస్సెన్షన్
ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ప్లానింగ్ డిపార్టుమెంట్ లో అసిస్టెంట్
సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
స్కిల్
డెవలప్మెంట్ స్కామ్ లో పెండ్యాల శ్రీనివాస్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు డబ్బులు అందాయని సీఐడీ ఆరోపించింది.
ప్రస్తుతం ప్లానింగ్ విభాగంలో విధులు
నిర్వహిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అమెరికా వెళ్ళారు.
ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి
ఉంటుంది.ఈ నిబంధనను అతిక్రమించడంతో పెండ్యాల శ్రీనివాస్ కు ప్లానింగ్
డిపార్టుమెంట్ మెమో జారీ చేసింది. వారం రోజుల్లో అమెరికా టూర్‌పై సంజాయిషీ
ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఆయన నుంచి స్పందన లేకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.