క్రికెట్
వరల్డ్‌కప్ టోర్నమెంట్ సందర్భంగా దాడులకు పాల్పడుతామంటూ ఖలిస్తానీ వేర్పాటువాది
గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రకటించడంపై అహ్మదాబాద్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ 5న
గుజారాత్ లోని అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభమయ్యే వరల్డ్‌కప్ మ్యాచ్‌ల
సందర్భంగా బీభత్సం సృష్టిస్తామంటూ పన్నూ ప్రకటించడాన్నిపోలీసులు
తీవ్రంగా పరిగణించారు.
నిషేధిత
సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి పలువురికి హెచ్చరిక సందేశాలు అందాయి. ముందే
రికార్డు చేసిన ఓ వాయిస్ మెసేజ్‌ను విదేశీ ఫోన్ నంబరుతో సోషల్ మీడియాలో షేర్
చేశారు. +447418343648 నంబరు నుంచి మెసేజ్ పంపారు. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్
సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఈ సందేశాల్లో చెప్పారు. పన్నూను
భారత ప్రభుత్వం 2020 జూలై 1న ఉగ్రవాదిగా ప్రకటించింది.
తమకు అందిన ఫిర్యాదు మేరకు
ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
విదేశీ
పోన్ నంబరుతో వస్తున్న కాల్ ను రిసీవ్ చేసుకున్న తర్వావాత ప్రి-రికార్డెడ్ వాయిస్
మెసేజ్ వినిపిస్తోందని అసిస్టెంట్ కమిషనర్ ఆప్ పోలీసు జీతూ యాదవ్ తెలిపారు. ‘‘అమర
వీరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, మీ బుల్లెట్లకు
వ్యతిరేకంగా బ్యాలెట్లు ఉపయోగిస్తాం. హింసాకాండకు ప్రతీకారంగా ఓట్లు వేస్తాం.
అక్టోబర్ 5ను గుర్తు పెట్టుకోండి. క్రికెట్ ప్రపంచ కప్‌కు బదులు టెర్రర్ కప్
మొదలవుతుంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో ఖలిస్తాన్ జెండాలతో అహ్మదాబాద్‌ను
ముట్టడిస్తాం’’ అని ఆడియో కాల్ లో
వినిపిస్తుంది.
ఖలిస్తాన్
ఉద్యమానికి మద్దుతుగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో
గురుపత్వంత్ సింగ్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. ఖలిస్తాన్‌కు అనుకూలంగా ఆయా దేశాల
మద్దతు కోసం అతడు లాబీయింగ్ చేస్తున్నాడు.
హర్దీప్ సింగ్ హత్య అనంతరం తీవ్రంగా స్పందించిన పన్నూ, కెనడాలోని హిందువులు
అంతా దేశం విడిచిపోవాలని హెచ్చరించాడు.