విశాఖపట్నం
వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకువచ్చింది. శుక్రవారం రాత్రి
దానిని గమనించిన పర్యాటకులు, మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పురాతన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్
సాయంతో ఒడ్డుకు చేర్చారు.
రాత్రంతా పెట్టెకు పహరా కాసారు. పెట్టె సమాచారం
చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో దానిని చూసేందుకు పలువురు తరలివచ్చారు.
పెట్టె కొట్టుకు వచ్చిన విషయాన్ని పోలీసులు, ఆర్కియాలజీ
విభాగానికి తెలిపారు. పెట్టె బరువు ఎక్కువగా ఉండటంతో అందులో ఇతర వస్తువులు
ఉండొచ్చుని అనుమానిస్తున్నారు.
విశాఖ
తీరానికి గతంలోనూ కొన్ని వస్తువులు కొట్టుకు వచ్చాయి. ఇప్పుడు ఈ పురాతన చెక్క
పెట్టెలో ఏముందనేని ఆసక్తి రేపుతోంది. దానిని పురావస్తు అధికారుల సమక్షంలో
పోలీసులు తెరవనున్నారు. అందులో భారీ సంపద ఉండొచ్చు అనే చర్చ కూడా స్థానికంగా
జరుగుతోంది. ఎక్కడ నుంచి కొట్టుకువచ్చిందనేది మిస్టరీగా ఉంది.