రాష్ట్ర
వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఆవర్తన
ప్రభావంతో ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల పాటు కోస్తా, రాయలసీమ
ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.
అక్టోబర్ 3 నుంచి ఉత్తరకోస్తాలో వర్షాలు ఎక్కువగా
పడతాయి.
అల్లూరి
సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, ప్రకాశం, అన్నమయ్య,
నంద్యాల, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
తూర్పుగోదావరి,
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే
సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
శ్రీకాకుళం,
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి కృష్ణా,
గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి
జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ
వెల్లడించింది.
రాష్ట్రంలో శుక్రవారం పలు
చోట్ల భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో గంటపాటు వాన కురిసింది. ఉమ్మడి విశాఖ
జిల్లాలో మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయింది. అనకాపల్లిలో 45 నిమిషాల పాటు భారీ
వర్షం కురిసింది.