అమరావతి
రింగు రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు
చేసిన పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. అలాగే అంగళ్లు అల్లర్ల
కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వు చేసింది.
ఇన్నర్
రింగ్ రోడ్డు కేసులో సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. లింగమనేని
రమేష్ భూముల పక్క నుంచి వెళ్ళేలా రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో మార్పులు చేశారని,
దీంతో ఆ భూమి ధర భారీగా పెరిగిందని సీఐడీ వాదించింది. హెరిటేజ్ సంస్థ కూడా భూ
అక్రమాలకు పాల్పడిందని కోర్టుకు తెలిపారు.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు
న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు,
తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. బెయిల్ నిరాకరణకు లింగమనేని వ్యవహారానికి
లింకు పెట్టొద్దని న్యాయస్థానాన్ని లూధ్రా కోరారు.
స్కిల్
కేసులో క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా అక్టోబర్ 3నే సుప్రీంకోర్టు వాదనలు
విననుంది.