ఇస్కాన్ నిర్వహిస్తోన్న గోశాలల నుంచి ఆవులను కబేళాలకు అమ్ముకుంటున్నారంటూ బీజేపీ నేత మేనకాగాంధీ చేసిన ఆరోపణలపై పరవు నష్టం దావాకు సిద్దమవుతున్నారు.మేనకాగాంధీ ఆరోపణలు చాలా దురదృష్ణకరమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆమెపై రూ.100 కోట్లకు
పరువు నష్టం దావా వేసి ఇవాళ నోటీసులు ఇవ్వనున్నట్టు కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాథా రమణ్ దాస్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం నుంచి భారీగా భూములు తీసుకుని, అనేక ప్రయోజనాలు పొంది గోశాలలు నిర్వహిస్తోన్న ఇస్కాన్, అందులోని ఆవులను కబేళాలకు అమ్ముతోందంటూ మేనకాగాంధీ పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారడంతో వివాదం మొదలైంది. ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన మేనకాగాంధీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక నమ్మకమైన సేవా సంస్థపై ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారంటూ రాథా రమణ దాస్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా 60 గోశాలల్లో వేలాది ఆవులను కంటికి రెప్పలా కాపాడుతున్నామని ఆయన ప్రకటించారు.