బొజ్జ
గణపయ్య విగ్రహాల నిమజ్జనం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం నెలకొంది.
నవరాత్రుల్లో పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడి విగ్రహాలను గంగమ్మ చెంతకు
చేరుస్తున్నారు. జై బోలో గణేశ్ మహారాజ్ నినాదం మార్మోగుతోంది. డప్పు వాయిద్యాల
నడుమ ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు.
అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా
పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊరేగింపు
సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.
హుస్సేన్ సాగర్ లో శుక్రవారం ఉదయం నాటికి 19,870 విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఎల్బీ
నగర్ జోన్ లో 3,150, ఖైరతాబాద్ జోన్ లో 2,059, చార్మినార్ ప్రాంతంలో 983
విగ్రహాలను నిమజ్జనం చేశారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనుల్లోనూ నిమజ్జనం చేస్తున్నారు.
తెలుగుతల్లి ఫ్లైఓవర్
నుంచి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వైపుగా ఊరేగింపు వాహనాలు మళ్ళించారు. సాధారణ
వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.