టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్
డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో
విచారణ చేపట్టిన హైకోర్టు అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయకుండా ఆగాలని సూచించింది. ఈ
మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఫైబర్
గ్రిడ్ స్కాం కేసు లో లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు విచారించింది.
విచారణను అక్టోబర్ నాల్గో తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
ను హైకోర్టు, అక్టోబర్ 4కు వాయిదా వేసింది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో
లోకేశ్ కు 41 ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
ఇక
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ పిటిషన్ లో
భాగంగా ఈ నెల 27న వాదనలు జరగగా, న్యాయమూర్తి ఈ రోజుకు వాయిదా వేశారు.
అమరావతి
రాజధాని నగరానికి సంబంధించి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దానిని
అనుసంధానించే రహదారుల ఎలైన్మెంట్ లో అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ
రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు
చేసింది. చంద్రబాబు సహా పలువురిని నిందితులుగా చేర్చింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సిద్ధార్థ లూధ్రా వర్చువల్ గా వాదనలు వినిపిస్తున్నారు.