తిరువణ్ణామలై అని తమిళులు పిలుచుకునే
పుణ్యక్షేత్రం అరుణాచలంలో భాద్రపద పూర్ణిమ సందర్భంగా జరిగే గిరి ప్రదక్షిణ
కార్యక్రమంలో ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారు.
పూర్ణిమ పర్వదినం సందర్భంగా అరుణాచలంలో భక్తులు
గిరి ప్రదక్షిణ చేసారు. 8 శివలింగాలను దర్శించుకుంటూ 14 కిలోమీటర్ల పాటు ప్రదక్షిణ
చేసారు.
భక్తులకు ఎలాంటి అంతరాయమూ కలక్కుండా పటిష్ట
భద్రతా ఏర్పాట్లు చేసారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో అరుణాచలం కిక్కిరిసిపోయింది.
ఆలయం నాలుగు ద్వారాల వద్దా చెక్‌పోస్టులు పెట్టారు. అన్ని వాహనాలనూ క్షుణ్ణంగా
తనిఖీ చేసిన తర్వాతే అరుణాచలంలోకి వెళ్ళనిచ్చారు.
భక్తుల సౌకర్యార్థం 13 తాత్కాలిక బస్ స్టాపులు
కూడా ఏర్పాటు చేసారు. భక్తులు భజనలు చేస్తూ, సంగీతవాద్యాలు వాయిస్తూ అన్నామలయ్యర్
అని పిలువబడే అరుణాచలేశ్వరుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసారు.
అరుణాచలంలో పూర్ణిమ నాటి గిరి ప్రదక్షిణ గురువారం
సాయంత్రం గం.6.48నిమిషాలకు ప్రారంభమయింది. ఇవాళ మధ్యాహ్నం గం.3.25 నిమిషాలకు
ముగుస్తుంది.
ఈ ప్రదక్షిణను తమిళంలో గిరివలం
అని వ్యవహరిస్తారు. ప్రతీ నెలా పూర్ణిమ రోజు తిరువణ్ణామలై కొండ చుట్టూ భక్తులు
కాలినడకన ప్రదక్షిణం చేస్తారు. వేలాది భక్తులు అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుని,
14 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు.