అమరావతి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు
బెయిల్ కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు, తాజాగా మరో పిటిషన్
వేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
చేశారు. ఈ కేసులో ఆయన ఏ25 గా ఉన్నారు.
స్కిల్
స్కామ్ కేసులో అరెస్టు అయి జుడీషియల్ రిమాండ్ లో భాగంగా రాజమహేంద్రవరం
కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబును పీటీ వారెంట్ పై విచారించేందుకు అనుమతి కోరుతూ
సీఐడీ, ఏసీబీ కోర్టును కోరింది. ఫైబర్ గ్రిడ్, అమరావతి రింగు రోడ్డు, అంగళ్ళు
కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారని కోర్టుకు వివరించింది.
అలాగే స్కిల్ కేసులో
మరోసారి రిమాండ్ కోరుతూ మరో పిటిషన్ వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషిన్ కూడా
విచారణకు రానుంది. వీటన్నింటిని అక్టోబర్ 4న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
విచారించనున్నారు.
స్కిల్
కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు క్వాష్ చేయాలంటూ సుప్రీంకోర్టులో
చంద్రబాబు వేసిన పిటిషన్ అక్టోబర్ 3న
బెంచ్ ముందుకు వచ్చే అవకాశముంది.
చంద్రబాబు
వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పేరిట చంద్రబాబు, ప్రభుత్వ నిధులు దారి మళ్ళించి
సొమ్ము చేసుకున్నారని సీఐడీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం వాదనలు వినేందుకు అవకాశం
ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్రప్రభుత్వం అభ్యర్థించింది.