ఉరుగ్వే తీరంలో ఘోరం వెలుగు చూసింది. బర్డ్ ఫ్లూ కారణంగా 400లకు పైగా సీల్స్, సీ లయన్స్ మృత్యువాతపడ్డాయి. మాంటెవీడియో సమీపంలోని బీచ్‌లో వీటిని గుర్తించారు. చనిపోయిన సీ లయన్‌లో హెచ్5 బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించారు. వైరస్‌ను అదుపు చేయడానికి ఇప్పటికే చనిపోయిన 350 సీల్స్‌ను ఖననం చేశారు.వందలాది సీల్స్, సీ లయన్స్ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయినట్టు తేలిందని ఉరుగ్వే పర్యావరణ శాఖలోని ఉన్నతాధికారి కార్మెన్ లీజాగోయెన్ ప్రకటించారు.
బర్డ్ ఫ్లూను అదుపు చేయలేమని, జంతువులు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం తప్ప చేయగలిగింది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉరుగ్వే సముద్ర జలాల్లో 3,15,000 సీల్స్, సీ లయన్స్ ఉన్నట్లు గుర్తించారు.చనిపోయిన జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకకుండా దూరంగా ఉండాలని సమీప ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. జంతువుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని అధికారులు తెలిపారు.