టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో
అరెస్టు చేయబోమని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. సీఆర్పీసీ 41(ఏ) కింద నోటీసులు
ఇచ్చి విచారిస్తామని, విచారణలో సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకెళ్ళి అరెస్టు చేస్తామని
అడ్వకేట్ జనరల్ తెలిపారు.
లోకేశ్ విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏజీ కోరగా
నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేసుకోవచ్చు అని సూచించింది.
అమరావతి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా ఉన్న నారా లోకేశ్, ఏపీ హైకోర్టులో ముందస్తు
బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్రప్రభుత్వం
తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించగా, లోకేశ్ తరఫున దమ్మాలపాటి
శ్రీనివాస్ వాదించారు.
ఈ
కేసులో లోకేశ్‌కు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించి నిబంధనలు
పాటిస్తామని కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో దర్యాప్తు అధికారి మార్పులు చేశారని
కోర్టుకు వివరించారు. సీఆర్పీపీసీ 41 ఏ నోటీసులు అంటే అరెస్టు ప్రస్తావన రానందున
ముందస్తు బెయిల్ పై విచారణ ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
లోకేశ్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో మరో రెండు
పిటిషన్లు దాఖలుచేశారు. నైపుణ్యాభివృద్ధి కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో లోకేశ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.
కాసేపట్లో న్యాయమూర్తి వాదనలు విననున్నారు.