చైనాలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళా విభాగంలో 17 ఏళ్ల పాలక్ స్వర్ణ పతకం సాధించింది. ఇదే ఈవెంట్లో ఈషా సింగ్ రజత పతకం గెలుచుకుంది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళా విభాగంలో 242.1 పాయింట్లు సాధించిన పాలక్ ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2018 ఆసియా క్రీడల్లో చైనా నెలకొల్పిన రికార్డును పాలక్ బద్దలు కొట్టింది. ఈషా 239.7 పాయింట్లు సాధించి ఆసియా క్రీడల్లో నాలుగో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. తాజాగా వచ్చిన రెండు పతకాలతో భారత్ ఆసియా క్రీడల్లో ఒక్క షూటింగ్ విభాగంలోనే 17 పతకాలు సొంతం చేసుకుంది. మొత్తం ఇప్పటి వరకు భారత్ 30 పతకాలు సాధించింది. ఇందులో 8 బంగారు పతకాలు, 11 రజత పతకాలు కాగా 11 కాంస్య పతకాలు గెలుచుకుంది.
50 మీటర్ల రైఫిల్ పురుషుల విభాగంలో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షియోరన్లు బంగారు పతకం సాధించారు. వీరు 1769 పాయింట్లు సాధించి స్వర్ణం దక్కించుకోగా 1748 పాయింట్లు సాధించిన దక్షిణ కొరియా షూటర్లు రజత పతకం దక్కించుకున్నారు. భారత షూటర్లు ఈ విభాగంలోని 1761 పాయింట్ల ప్రపంచ రికార్డును చెరిపేశారు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ మహిళా విభాగంలో భారత బృందం ఈషా సింగ్, పాలక్, దివ్య సుబ్బరాజు రజత పతకం సాధించారు. వీరు వ్యక్తిగత విభాగంలోనూ సత్తా చాటారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్