భారత అంతరిక్ష ఫరిశోధనా సంస్థఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గుజరాత్లోని
సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ప్రయోగాలు
విజయవంతమయ్యేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన
సోమేశ్వర్ మహాపూజలోనూ, ఆ తర్వాత మందిర ప్రాంగణంలోని వినాయక ఆలయంలో యజ్ఞంలోనూ
పాల్గొన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
వెరవల్ పట్ణణంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకున్నాక,
ఇస్రో చీఫ్ విలేకర్లతో మాట్లాడారు. చంద్రయాన్ 3 సాఫ్ట్
ల్యాండింగ్ కావాలన్న తమ కృషి స్వామివారి కృపవల్లే విజయవంతమైందన్నారు. సోమనాథుడి
ఆశీస్సులు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదన్నారు. భవిష్యత్తులో
ఇస్రో చేపట్టే మిషన్లకు ఆ మహాదేవుడి ఆశీస్సులు కోరినట్టు ఇస్రో చీఫ్
చెప్పారు.
‘చంద్రుడిపై ల్యాండింగ్
మాకు ఓ లక్ష్యం. మాకు బలం అవసరమయ్యే అనేక ఇతర మిషన్లు మా ముందు ఉన్నాయి. అందుకే
భగవంతుడి ఆశీస్సులు పొందేందుకు వచ్చా’నని చెప్పారు. శ్రీకృష్ణుడు తుదిశ్వాస
విడిచిన బాల్కతీర్థను కూడా ఆయన సందర్శించారు.