ప్రపంచ దేశాలకు బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తోన్న దేశంగా పాకిస్థాన్ నిలిచింది. విదేశాల్లో
అరెస్టవుతోన్న యాచకుల్లో 90శాతం మంది పాకిస్థానీయులే ఉన్నట్లు ఆ
దేశ ప్రభుత్వం వెల్లడించింది. మక్కా మసీదులో దొరికే జేబు దొంగల్లో అత్యధికంగా పాక్ జాతీయులే ఉంటున్నట్లు
తెలిపింది.
విదేశాల్లో పాకిస్థానీలకు సంబంధించి
అక్కడి సెనెట్‌లో చర్చ జరిగింది. విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ
స్టాండింగ్ కమిటీ దీనిపై చర్చించింది. పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ
సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగశాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ కమిటీకి
వెల్లడించారు.
సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లేందుకు ‘యాత్రికుల
వీసా’ను ఉపయోగించుకుంటున్నార.. పాక్ జేబు దొంగలకు ఇప్పటివరకు పశ్చిమాసియా దేశాలే
గమ్యంగా ఉండగా.. అటువంటి వారికి ఇప్పుడు జపాన్ కొత్త గమ్యస్థానంగా
మారుతోందన్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో 50వేల మంది ఇంజినీర్లు నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. భారత్
చంద్రుడిని చేరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ప్రతిరోజు పొరపాట్లు చేస్తూనే
ఉందన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం, సౌదీ అరేబియాలో దాదాపు 30లక్షల మంది,
యూఏఈలో 15లక్షల మంది, ఖతర్‌లో 2లక్షల మంది పాకిస్థానీలు ఉన్నారని అంచనా.