నైపుణ్యాభివృద్ధి
కేంద్రాల ఏర్పాటులో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ చంద్రబాబు
సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 3న ఈ కేసు వాదనలు సర్వోన్నత న్యాయస్థానం
విననుంది. దీంతో రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.
చంద్రబాబు
దాఖలు చేసిన పిటిషన్లో భాగంగా తమ వాదన వినాలని అభ్యర్థించింది. స్కిల్ డెవలప్మెంట్
కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు.
విద్యార్థులకు శిక్షణ పేరిట కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, నిధులను షెల్
కంపెనీల ద్వారా దారి మళ్ళించి సొమ్ము చేసుకున్నారని వ్యాజ్యంలో ప్రభుత్వం
తెలిపింది.
ఈ కేసులో మా వాదన మీ ముందు ఉంచుతామని న్యాయమూర్తిని కోరారు.
తనను
అవినీతి నిరోధక చట్టం లోని 17(ఏ)కు విరుద్ధంగా అరెస్టు చేశారని, అనంతరం ఎఫ్ఐఆర్ లో
పేరు నమోదు చేశారని హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు.
దర్యాప్తు తుది
దశలో ఉన్నందున తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమంటూ హైకోర్టు పేర్కొంది. పిటిషన్
డిస్మిస్ చేశారు.
హైకోర్టు
ఉత్తర్వులను చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 27న
దిస్వభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. కానీ అందులోని జస్టిస్ ఎస్వీఎన్
భట్టి ‘నాట్ బీఫోర్ మీ’ అన్నారు. దీంతో
అక్టోబర్ 3కు మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వాయిదా వేశారు.
ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాది
సిద్ధార్థ లూధ్రా, చీఫ్ జస్టిస్ ఎదుట ప్రస్తావించారు. తమ పిటిషన్ వాదనలు విని
చంద్రబాబుకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కోరారు. అయితే సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు
వినిపించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో కేసును అక్టోబర్ 3న వేరే బెంచ్ కు పంపుతామని
ఆరోజే పూర్తి వాదనలు వినిపించాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్
లీవ్ పిటిషన్ లో తాము వాదనలు వినిపిస్తామని రాష్ట్రప్రభుత్వం కేవియట్ దాఖలు
చేసింది.