స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు చివరకు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముడి చమురు ధరలు పెరిగిపోవడం, విదేశీ పెట్టుబడిదారులు భారీ అమ్మకాలకు దిగడంతో ఏ దశలోనూ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లకు మద్దతు లభించలేదు.ఈ నెల డెరివేటివ్స్ ముగింపు కూడా ఇవాళే కావడంతో దాని ప్రభావం కూడా దేశీయ స్టాక్ సూచీలపై పడింది.
ఇవాళ ఉదయం సెన్సెక్స్ నష్టాలతో మొదలైంది. చివరకు 610 పాయింట్లు నష్టపోయి 65508 వద్ద ముగిసింది. నిఫ్టీ 192 పాయింట్ల నష్టంతో 19761 వద్ద ముగిసింది. రూపాయితో డాలర్ మారక విలువ 83.19 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30లో భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, ఎం అండ్ ఎం, హెచ్ యూ ఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.